ప్రజా పాలనలో  విద్యకు పెద్దపీట : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రజా పాలనలో  విద్యకు పెద్దపీట : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

చేర్యాల, వెలుగు: ప్రజా పాలనలో విద్యా రంగానికి అత్యధిక ప్రాముఖ్యత లభిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మండలంలో సుమారు రూ. 4 కోట్లతో నూతనంగా నిర్మించిన జీపీ భవనాలు, ఎస్జీహెచ్ భవనాలతో పాటు, చేర్యాల పట్టణంలోని కేజీబీవీ బాలికల విద్యాలయంలో రూ. 2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను శుక్రవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ కె.హైమావతిలతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఎంపీ మాట్లాడుతూ విద్య ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం విద్యకు అధిక నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, రాజీవ్ గాంధీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌‌‌‌‌‌‌‌ను నిర్మించబోతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు, స్వయం ఉపాధికి మహిళా సంఘాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.